యూట్యూబ్​ జాబ్​​ స్కామ్​తో రూ. 13లక్షలు పోగొట్టుకున్న మహిళ!

దేశంలో సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా.. సింపుల్​గా డబ్బులు వచ్చేస్తాయన్న భ్రమలో పడి, ప్రజలు మోసపోతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్​ వీడియోలు లైక్​ చేస్తే.. రోజుకు రూ. 5వేల వరకు సంపాదించుకోవచ్చు అని వచ్చిన ఓ మెసేజ్​ను నమ్మిన ఓ మహిళ.. ఏకంగా రూ. 13లక్షల వరకు మోసపోయింది!

ఇదీ జరిగింది..

గ్రేటర్​ నోయిడాలోని పంచ్​షీల్​ హైనిష్​ సొసైటీలో నివాసముంటున్న కార్తికకు కొన్ని నెలల క్రితం ఓ వాట్సాప్​ మెసేజ్​ వచ్చింది. వర్క్​ ఫ్రం హోంకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. యూట్యూబ్​లో వీడియోలు లైక్​ చేసి, ఛానెళ్లకు సబ్​స్క్రైబ్​ చేసుకుంటే రోజుకు రూ. 50 నుంచి రూ. 5000 వరకు డబ్బులు సంపాదించవచ్చు అని ఆ మెసేజ్​లో రాసి ఉంది. చాలా సింపుల్​గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని భావించిన ఆమె.. సంబంధిత మెసేజ్​లో ఉన్న టెలిగ్రామ్​ అకౌంట్​​ లింక్​పై క్లిక్​ చేసి, వారిని సంప్రదించింది.

స్కామ్​స్టర్స్​.. యూట్యూప్​లో వీడియోలకు లైక్​ కొట్టడంతో ఆమెకు రూ. 150 ఇచ్చారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. డబ్బులు వస్తున్నాయి కదా అని ఆమె వారిని నమ్మడం మొదలుపెట్టింది.

ఇదీ చూడండి:- IRCTC : యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు

అప్పుడే మోసగాళ్లు తమ పని మొదలుపెట్టారు. ‘రూ.2వేలు ఇన్​వెస్ట్​ చెయ్​.. మంచి రిటర్నులు వస్తాయి,’ అని చెప్పడంతో ఆమె వారికి డబ్బులు ఇచ్చింది. అదే రోజు రూ. 3,150 వెనక్కి రావడంతో ఇక ఆమె ఏం ఆలోచించలేదు. రూ. 5వేలు, రూ. 30వేలు, రూ. 90వేలు.. ఇలా భారీ మొత్తాలను ఇన్​వెస్ట్​ చేస్తూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రిటర్నులు ఆగిపోయాయి.

‘పోయాం.. మోసం..’

YouTube Job scam news : ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఒక టాస్క్​ తప్పుగా చేసిందని, అందుకే ఆగిపోయాని నేరగాళ్లు చెప్పారు. ఇంకో లింక్​ ఇచ్చి, దానిని పూర్తి చేసి, మళ్లీ ఇన్​వెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. అలా చేయకపోతే.. పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగిరావని భయపడిన ఆమె.. ఇంకా, ఇంకా ఇన్​వెస్ట్​ చేస్తూ వెళ్లింది. లోన్​లు తీసుకుని కూడా డబ్బులు ఇచ్చింది. “రూ. 15లక్షల అమౌంట్​ దాటితే.. ఫుల్​ పేమెంట్​ ఇస్తాము,” అని స్కామర్​ అనడంతో ఆమెకు, ఆమె భర్తకు డౌట్​ కొట్టింది. ఇంకో సందర్భంలో రూ. 5లక్షలు ఇవ్వాలని అడిగిన తర్వాత.. తాము మోసపోయామని వారికి అర్థమైంది. చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :