అక్క అక్క అంటూనే అసభ్యకరంగా. కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ శివ జ్యోతి!

సెలబ్రిటీ అనే ట్యాగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అనేక రకాలైన ట్రోల్స్ కు గురికావడం సహజం. సోషల్ మీడియా విస్తృతం అయ్యే కొద్దీ అందులో ఉండే సినీ,రాజకీయ ప్రముఖులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి.

ముఖ్యంగా వెండితెర, బుల్లితెర నటీనటులకు ఇలాంటివి ఎక్కువ. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి కి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.

తెలంగాణ కట్టు, బొట్టు తో ఆకట్టుకొని బిగ్ బాస్ 3 లో టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచిన శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకొని తన కెరీర్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా చేయటమే ఇప్పుడు శివ జ్యోతి చేసిన తప్పు అవ్వడమే కాకుండా మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టింది.

తాజాగా ఆమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వీడియో లో తన భర్త గంగూలీ ఆమెకి కొనించిన బంగారు ఆభరణాలు చూపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె భర్త గంగూలీ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకరు ‘అక్క మీ భర్త ఏమి చేస్తుంటాడని’ కామెంట్స్ చేస్తే, మరొకరు ‘ఏమి జాబ్ చేయాలో ఆలోచిస్తాడు అంటూ’ కామెంట్స్ చేశారు . మరికొందరు అయితే “అక్క మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారని” కామెంట్స్ చేస్తూ శివ జ్యోతిని మానసికంగా ఇబ్బందులను గురిచేస్తున్నారు.

గతంలో తన ప్రెగ్నెన్సీ గురించి శివ జ్యోతి మాట్లాడుతూ ” మా పెళ్లి అయ్యి ఎన్నో ఏళ్ళు అవుతుంది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ మొత్తం ఎదురుచూస్తోంది. నేను కూడా ఎదురుచూస్తున్నాను, ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో అది పెద్ద విషయం. ఇలా కామెంట్స్ చేయటం వలన పర్సనల్ గాను ప్రొఫెషనల్ గా నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది”. అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. అదే సమయంలో శివ జ్యోతి కి సోషల్ మీడియా లో మద్దతుగా అనేక మంది మాట్లాడుతూ, రాంచరణ్ కి పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత కానీ పిల్లలు కలగలేదు కదా.. కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు మీరు పట్టించుకోవద్దు అంటూ సావిత్రక్కకు సపోర్ట్ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

శివజ్యోతి, గంగూలీలది ప్రేమ వివాహం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామానికి చెందిన శివ జ్యోతి, గంగూలీని ప్రేమించడం వాళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొత్తలో గంగూలీ ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణ చూసుకునేవాడు. ఆ తర్వాత శివ జ్యోతి న్యూస్ యాంకర్ గా జాబ్ చేయటం బిగ్ బాస్ లో ఆఫర్ రావడం, ఆ తర్వాత బయట అవకాశాలు ఎక్కువగా రావడంతో పాటుగా శివజ్యోతి సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం తో తన జాబ్ కు రాజీనామా చేసి ఇప్పుడు ఆ పనులన్నీ గంగూలీనే చేసుకుంటున్న విషయం తెలిసిందే..

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :