యాపిల్‌ను వదులుకున్న దురదృష్టవంతుడెవరో తెలుసా.

ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా? జపాన్‌కు చెందిన సుటోము యమగుచి. ఎందుకంటే? ఇతను రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల నుంచి బయటపడ్డాడు.

1945, ఆగస్ట్‌ 6న అమెరికా యుద్ధ విమానం ఎనోలాగే ‘లిటిల్‌ బాయ్‌’ అనే బాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఒక్క క్షణంలోనే నగరంలోని 2.5 లక్షల జనాభాలో 80 వేల మంది మృత్యువాతపడ్డారు. సరిగ్గా ఆ బాంబు ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుటోము ప్రాణాలతో బయటపడ్డారు. సుటోము యమగచి ఉన్న ప్రాంతంలో ప్రాణాలతో బయపడింది ఇతను ఒక్కడే. జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఇతడే. అందుకే ప్రపంచంలోనే అంత్యంత లక్కీయెస్ట్‌ పర్సన్‌గా గుర్తింపు పొందారు.

మరి ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరో తెలుసా? రోనాల్డ్‌ వేన్‌. వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ మూడో కోఫౌండర్‌. మరి అన్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌ ఎందుకంటే 290 బిలియన్‌ డాలర్ల షేర్లను కేవలం 800 డాలర్లకే అమ్మేశాడు. కాబట్టే ఇతనే వరల్డ్‌లోనే అన్‌ లక్కీయెస్ట్‌ పర్సన్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.

1976లో కంపెనీ ఏర్పాటు..

1976, ఏప్రిల్‌ 1న కాలిఫోర్నియాలో స్టీవ్‌ వోజ్నియాక్‌(21), స్టీవ్‌ జాబ్స్‌(25), అనుభవంలో, వయస్సులో పెద్దవారైన రోనాల్డ్‌ వేన్‌(42)తో కలిసి యాపిల్‌ కంపెనీని ప్రారంభించారు. అదే రోజు యాపిల్‌ ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన రోనాల్డ్‌ వేన్‌.. కంపెనీలో ఎవరి బాధ్యతలు ఏంటో తెలుపుతూ ఓ అగ్రిమెంట్‌ రాశారు. దీంతోపాటు యాపిల్‌ ప్రొడక్ట్‌కు సంబంధించిన తొలి లోగోని తయారు చేశారు. ఐజాక్‌ న్యూటన్‌ ఒక చెట్టు కింద యాపిల్‌ తింటున్న ఫొటోని తయారు చేసింది ఇతనే. ఈ లోగోని ఏడాది కంటే తక్కువ కాలం ఉపయోగించింది యాపిల్‌ సంస్థ.

12 రోజులకే భారీ ఆర్డర్‌

ఇక, స్టీవ్‌ వోజ్నియాక్, స్టీవ్‌ జాబ్స్, రోనాల్డ్‌ వేన్‌ భాగస్వామ్యంలో యాపిల్‌ సేవల్ని ప్రారంభించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో అమెరికాలోనే తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ను అమ్మిన కంప్యూటర్‌ రీటైల్‌ సంస్థ ‘బైట్‌ షాప్‌’ తమకు 100 కంప్యూటర్లను తయారు చేసి పెట్టాలంటూ యాపిల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ఆర్డర్‌ వచ్చింది. కానీ, తయారు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడే కంప్యూటర్ల తయారీకి వినియోగించే పరికరాల కోసం స్టీవ్‌ జాబ్స్‌ 15 వేల డాలర్ల లోన్‌ తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా స్టీవ్‌ జాబ్స్‌ యాపిల్‌ కంప్యూటర్లను తయారు చేసి ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. కంప్యూటర్లను తయారు చేసి అప్పగించారు. కానీ తయారు చేసిన కంప్యూటర్ల తాలుకు బిల్స్‌ ఆగిపోయాయి.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :