వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. పవన్ కళ్యాణ్..

పిఠాపురంలోని చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద జనసేన పార్టీ విజయ భేరి బహింగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని వైసీపీపై సంచలన కామెంట్స్ చేశారు.

 

‘ఒంటరి ఉద్యమం చేస్తున్నాను దశాబ్ద కాలం నుండి చేతులు జోడించి అడుగతున్నాను నన్ను గెలిపించండి. నేను మీకోసం నిలబడతాను. సమస్యలపై వైసీపీ నేతలను నిలదీయాలి. మద్యాన్ని నేషేధిస్తామని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు. నాణ్యమైన మద్యం అమ్మకపోవడంతో చాలా మంది చనిపోతున్నారు. ఏపీలో రోజుకు రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు చేస్తున్నారు. లిక్కర్ లో జగన్, పవర్ స్టార్ బ్రాండ్స్ ఉన్నాయి మద్యం ద్వారా వచ్చిన ఆదాయం జగన్ జేబుల్లోకి వెళ్తోంది. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ. జగనే అసలు పెత్తందారు.

 

పిఠాపురంలోనే ఇల్లు తీసుకుంటాను. పిఠాపురం నియోజకవర్గం సమస్యలు తీరుస్తా. నేను పారిపోను.. సమస్యలను పరిష్కరిస్తా.. నన్ను నమ్మండి. వైసీపీ కావాలా కూటమి కావాలో మీరో నిర్ణయం తీసుకోంది. సమస్యలు పరిష్కరించి ఉంటే పవన్ వచ్చే వాడు కాదు. పొత్తు ధర్మం ప్రకారం వర్మ పోటీ నుంచి తప్పుకుని.. సహకరించినందుకు ధన్యవాదములు. నన్ను ఓడించడానికి జగన్ మండలానికో నాయకుడ్ని పెట్టాడు.

 

నేను మీ భావోద్వేగాలు గౌరవించే వ్యక్తిని. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు చేస్తాను. గెలవగానే పిఠాపురంలో వైద్య వ్యవస్థ బాగు చేస్తాను. కేంద్రంలో దేవాలయాలకు ప్రత్యేక స్కీం ఉంది, కానీ మన పిఠాపురం కోసం వైసీపీ ఆ స్కీం ఉపయోగించలేదు. నేను పిఠాపురం దేవాలయాల అభివృద్ది కోసం రూ.70 నుండి రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తాను. జాతీయ పర్యాటక ప్రాంతంగా చేస్తాను. నాకు జగన్ లా తాతగారి గనులు లేవు, సాదారణ మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకును, మా అన్నయ్య చిరంజీవి నేర్పించిన యాక్టింగ్ ట్రైనింగ్ ద్వారా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చాను. నేను ఇక్కడ ఎంఎల్ఏ అయ్యాక కాకినాడ డాన్ ఎలా పిఠాపురంలో అడుగుపెట్టి దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తాడో చూద్దాం’ అని పవన్ అన్నారు.

 

అయితే ఈ సభ నిర్వహణకు కొన్ని గంటల ముందు పిఠాపురం పోలీసులు పవన్ వారాహి వాహనంపై ప్రసంగించడానికి అనుమతులు లేవని తెలిపారు. దీంతో పవన్ డీసీఎం వాహనంపై నిల్చుని సభలో ప్రసంగించడానికి ముందుకువచ్చారు. అయితే చివరి క్షణంలో వారాహి వాహనంకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. దీంతో పవన్ వారాహి వాహనానికి పూజలు చేసి దానిపై ప్రసంగించారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :