ఈసీ కొత్త రూల్స్..

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడల ఎన్నికలకు కేవలం 20 రోజులు ఉండడంతో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఏప్రిల్ 19 ఉదయం ఏడు నుంచి జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నవరకు పోల్ సర్వేపై నిషేధం విధించింది. అలాగే పోలింగ్‌కు 48 గంటల ముందు టీవీ ఛానెళ్లలో ఒపీనియన్ పోల్స్ ప్రచురించరాదని వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తి అయ్యేవరకు వీటిని ప్రచురించ డానికి వీల్లేదని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం వీటిని నిషేధించినట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రచురించుకోవడానికి వీలుంటుంది.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :