రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. శుక్రవారం ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని మూవీ టీమ్ తెలిపింది.