విజ్ఞానానికి సోపానాలు గ్రంథాలయాలు : లైబ్రరీ జిల్లా ఛైర్మన్ ఎల్ఎం ఉమామోహన్ రెడ్డి

విజ్ఞానానికి సోపానాలు గ్రంథాలయాలు : లైబ్రరీ జిల్లా ఛైర్మన్ ఎల్ఎం ఉమామోహన్ రెడ్డి

విజ్ఞానానికి సోపానాలు గ్రంథాలయాలని, పుస్తక పఠనం వల్ల అపార జ్ఞానాన్ని సంపాదించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎల్ఎం ఉమామోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాప్తాడు శాఖా గ్రంథాలయంలో 55వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఘనంగా జరిగింది. ఛైర్మన్ మాట్లాడుతూ
చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కుంటే మంచి స్నేహితుడని అన్న కందుకూరి వీరేశలింగం మాటలను అనుసరిద్దామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసాన్ని, జ్ఞానాన్ని అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. విద్యార్ధి దశ నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని, ప్రతిరోజూ గ్రంథాలయాలను సందర్శించి మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల జీవిత చరిత్రలు, ఇతిహాసాలు, దిన, వార, పక్ష, మాస పత్రికలను పఠించి విజ్ఞానాన్ని పెంపొందిచుకోవాలన్నారు. పుస్తక పఠనానికి ఉన్నంత ప్రాధాన్యత మరేదేనికి లేదని, చదవడానికి మార్గం సుగమం చేసేవి గ్రంథాలయాలని, వీటిని విజ్ఞాన కేంద్రాలుగా కూడా పిలుస్తుంటారన్నారు. తర్వాత ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి దంపతులు 50మంది విద్యార్థులకు రూ.5వేలు శాశ్వత సభ్యత్వం కింద జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమాదేవికి చెక్కును అందజేశారు. అనంతరం వారం రోజుల పాటు నిర్వహించిన వ్యాస, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, సర్పంచ్ సాకే తిరుపాలు, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, లైబ్రేరియన్లు వీరనారాయణరెడ్డి, సత్యనారాయణ, ఉపాధ్యాయుడు లక్ష్మన్న, సిబ్బంది సాకే ముత్యాలమ్మ, లక్ష్మీనారాయణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :