మా దేశం వస్తే 71 లక్షలు ఇస్తాం.. యూరప్‌ కంట్రీ బంపరాఫర్‌.. అదొక్కటే కండీషన్‌ !

కొంతకాలంగా ఐర్లాండ్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని దీవుల్లో కేవలం 160 మంది జనాభా మాత్రమే ఉంది.. అంటే ఏ స్థాయిలో జనాభా తగ్గిపోతుందో తెలుస్తోంది.
ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఐర్లాండ్‌ ప్రభుత్వం.. మళ్లీ జనాభా సంఖ్య పెంచుకునేందుకు వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
Ireland |విదేశాల్లో స్థిరపడాలనే ఆశపడే వాళ్లకు గుడ్‌న్యూస్‌. వేరే దేశాలకు వెళ్లి నివాసం ఉండాలంటే డబ్బులు చాలా కావాలనే భయంతో ఆలోచనను ఇకపై విరమించుకోవాల్సిన పనిలేదు. ఎంచక్కా ఈ యూరప్‌ దేశానికి వెళ్తే చాలు.. వాళ్లే మీ చేతిలో లక్షల రూపాయలు పెడతారు. ఏంటి నమ్మలేకపోతున్నారా! కానీ ఇది అక్షరాల నిజం. తమ దేశానికి వచ్చి స్థిరపడితే రూ.71 లక్షలు ఇస్తామని ఐర్లాండ్‌ దేశం ప్రకటించింది. అంతేకాదు ఆ దేశానికి వెళ్లిన వాళ్లకు రిలోకేషన్‌ డబ్బులు ఇవ్వడమే కాదు ఉద్యోగం కూడా వెతికిపెడతారంట. ఏదైనా స్టార్టప్‌ పెట్టాలనే ఆలోచన ఉంటే డబ్బులు కూడా పెట్టుబడి పెడతారంట.

Ireland2

ఏంటి ఆఫర్‌?

కొంతకాలంగా ఐర్లాండ్‌లో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని దీవుల్లో కేవలం 160 మంది జనాభా మాత్రమే ఉంది.. అంటే ఏ స్థాయిలో జనాభా తగ్గిపోతుందో తెలుస్తోంది. ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఐర్లాండ్‌ ప్రభుత్వం.. మళ్లీ జనాభా సంఖ్య పెంచుకునేందుకు వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అవర్‌ లీవింగ్‌ ఐలాండ్స్‌ ( Our Living Islands ) పాలసీలో భాగంగా తమ దేశంలోని దీవుల్లో సెటిల్‌ అయ్యే వాళ్లకు భారీగా పారితోషికం ఇవ్వాలని నిర్ణయించింది. తమ దేశానికి వచ్చి స్థిరపడేవారికి 80 వేల యూరోలు అందజేస్తామని ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అంటే.. భారత కరెన్సీలో చెప్పాలంటే ఐర్లాండ్‌ వెళ్లి సెటిల్‌ అయితే అక్కడి ప్రభుత్వం రూ.71 లక్షలు అందిస్తుందన్నమాట. ఐర్లాండ్‌లోని దాదాపు 90 దీవుల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కూడా పేర్కొంది.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :