చంద్రబాబుపై మరో కేసు నమోదు-ఈసారి ఏ2గా సీఐడీ ఎఫ్ఐఆర్..

ఏపీలో స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఊరట పొందిన టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పుకు ముందే మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ ఇసుక అక్రమాల కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. దీంతో ఈ వరుస కేసుల పరంపర ఎందుకన్న చర్చ జరుగుతోంది. అలాగే సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ దాదాపు ఒకేలా ఉంటుంటడం మరో విశేషం.

 

Advertisement

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఏపీ ఎండీసీ సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు, పలువురు టీడీపీ నేతలపై ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు అయినట్లయింది.ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది.

 

ఇసుక అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ-1 గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-౩గా చింతమనేని ప్రభాకర్‌, ఏ-4గా దేవినేని ఉమను పేర్కొన్నారు. వీరంతా తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని మైన్స్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ తదుపరి చర్యలు ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పటికే చంద్రబాబుపై మధ్యంతర బెయిల్ కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోబోమని సీఐడీ హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇసుక కేసులో వెంటనే చర్యలు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.

 

అటు చంద్రబాబు మద్యం కేసు తరహాలోనే ఇసుక అక్రమాల కేసులోనూ ముందస్తు బెయిల్ కు వెళతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు సీఐడీ ఈ నెల రోజుల్లో చర్యలు తీసుకోమంటూ ఊరటనిచ్చింది

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :