వాలంటీర్లు ఇప్పుడు గుర్తొచ్చారా ? బాబు హామీలపై వైసీపీ ఫైర్-పేర్ని సెటైర్లు..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వాలంటీర్ల కేంద్రంగా రాజకీయ పార్టీల రచ్చ పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగేళ్ల పాటు వాలంటీర్లపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి వారికి గౌరవ వేతనం పెంపు వంటి హామీలు ఇస్తుండటంపై వైసీపీ ఫైర్ అవుతోంది. చంద్రబాబుకు ఇన్నాళ్లకు వాలంటీర్లు గుర్తుకొచ్చారా అని ప్రశ్నిస్తోంది. ఇన్నాళ్లకైనా వాలంటీర్లను గుర్తించినందుకు ధన్యవాదాలు చెబుతోంది.

 

వాలంటీర్లకు చంద్రబాబు ఇస్తున్న హామీలపై స్పందించిన వైసీపీ.. ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో విప్లవాత్మక స్వచ్చంద వ్యవస్ద అయిన వాలంటీర్ల శక్తిని గుర్తించినందుకు చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇది జగనన్న పాలనా నమూనా విజయానికి నిదర్శనమని పేర్కొంది. ఈ మార్పును విపక్షాలు కూడా స్వీకరించి పాటించేలా చేసిందని గుర్తుచేసింది. జూన్ 4న జగన్ ప్రమాణస్వీకారం చేయడం, వాలంటీర్ల వ్యవస్ధను పునరుద్ధరించడం ఖాయమని తెలిపింది.

మరోవైపు చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కూడా సెటైర్లు వేశారు. బూటకాలకు, నయవంచనకు చంద్రబాబు మారుపేరని, కులాలను వాడుకుని మోసం చేసి విసిరిపడేశాడని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు గాలం వేస్తున్నాడన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేలు చేస్తానని ఎరవేస్తున్నాడన్నారు. నాలుగున్నరేళ్లు వాలంటీర్లను మానసికంగా క్షోభకు గురిచేశారని, వ్యక్తిత్వ హననం చేశారు..ఆత్మాభిమానాన్ని కించపరిచారని ఆరోపించారు.

 

బాంబే రెడ్ లైట్ ఏరియాలకు అమ్మాయిలను అమ్ముతారన్నారన్నారు. మగవాళ్లు ఇంట్లో లేకపోతే తలుపులు కొట్టి ఆడవాళ్లను లొంగదీసుకుంటారన్నారు, వాలంటీర్లు బియ్యం మూటలు మోస్తారన్నారన్నారని పేర్ని గుర్తుచేశారు.తన రాజకీయం కోసం వాలంటీర్ల పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. తన తాబేదారు నిమ్మగడ్డ రమేష్ తో వాలంటీర్ల సేవల్ని అడ్డుకుని, ప్రజల్లో తిరుగుబాటు రావడంతో తిరిగి వారికి హామీలు ఇస్తున్నాడని విమర్శించారు. వాలంటీర్లు డబ్బులకు అమ్ముడుపోరన్నారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :