కత్తి పెట్టి బెదిరించిన నటుడు బ్రహ్మాజీ

తాను చెప్పిన పని చేయనున్న దర్శకుడు అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరించాడు నటుడు బ్రహ్మాజీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విషయం ఏంటంటే… మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న బ్రహ్మాజీ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం పేరు స్లమ్ డాగ్ హస్బెండ్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దోషం పోవడానికి హీరో కుక్కను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ కుక్కతో చిక్కులు వచ్చిపడతాయి.

భిన్నమైన నేపథ్యం తీసుకుని బోల్డ్ కంటెంట్ తో స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో బ్రహ్మాజీ కొడుకు సంజయ్ ఆర్ రావు హీరోగా నటించాడు. ప్రణవి మానుకొండ హీరోయిన్. బ్రహ్మాజీ, సునీల్ కీలక రోల్స్ చేశారు. స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ జులై 29న విడుదల కానుంది. కొడుకు కోసం బ్రహ్మాజీ కొంచెం గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.

కాగా స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేయాలంటూ బ్రహ్మాజీ దర్శకుడు అనిల్ రావిపూడిని కోరారు. నా వల్ల కాదు. ప్రతిసారి నా దగ్గరకు వస్తున్నావని అనిల్ రావిపూడి విసుక్కున్నాడు. దాంతో బ్రహ్మాజీ అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరించాడు. ఏం చేయకు చెబుతా… జులై 29న స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ చూడండి అని చెప్పాడు.

కేవలం ప్రచారం కోసం అనిల్ రావిపూడి, బ్రహ్మాజీ ఒక ఫన్నీ వీడియో చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదు. ఈ మధ్య చిన్న చిత్రాల హీరోలు, దర్శక నిర్మాతలు ఇలానే చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ఏదో ఒక సెన్సేషన్ చేసి నలుగురు తమ మూవీ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. విన్నూతమైన సబ్జెక్టుతో వస్తున్న బ్రహ్మాజీ కొడుకు ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :