‘ఆదిపురుష్‌’ను వెంటాడుతున్న కష్టాలు..! డైరెక్టర్‌తో పాటు నటీనటులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు

ఆదిపురుష్‌ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్‌తో పాటు ప్రంటేషన్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం సినిమాను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.
Adipurush | ఆదిపురుష్‌ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్‌తో పాటు ప్రంటేషన్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ప్రస్తుతం సినిమాను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓం రౌత్‌తో పాటు నటీనటులపై కేసు నమోదు చేయాలని హిందూ మహాసభ డిమాండ్‌ చేసింది. ఆదిపురుష్‌ చిత్రంలో సీతామాత, హనుమాన్‌ను అవమానించారని, సనాతన ధర్మాన్ని కించపరిచే లక్ష్యంతో ఈ చిత్రం రూపొందించినట్లుగా ఆరోపించింది. ఈ మేరకు లక్నోలోని హజ్రత్‌గంజ్‌ కొత్వాలిలో చిత్రబృందంపై ఫిర్యాదు చేసింది. చిత్ర నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులందరిపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

 

ఇదిలా ఉండగా.. చిత్రంలోని పలు డైలాగ్స్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో వాటిని మార్చేందుకు మేకర్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించిన మాటల రచయిత మనోజ్‌ ముంతషీర్‌ శుక్లా ఓ ట్వీట్‌ చేశారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామ కథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠమన్నారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది సమయంతో పాటు మారుతూ ఉంటుందని, అయితే, ఆ అనుభూతి మిగిలి ఉంటుందన్నారు. ఆదిపురుష్‌ చిత్రంలో నాలుగువేలకుపైగా లైన్స్‌ డైలాగ్స్ రాశానని, కానీ ఐదు లైన్ల డైలాగ్స్‌లో సెంటిమెంట్లు దెబ్బతిన్నాయన్న ఆయన.. ఆ వందలాది పంక్తుల్లో శ్రీరాముని కీర్తింపబడిన, సీతమ్మ పవిత్రతను వర్ణించినందుకు ప్రశంసలు సైతం అందాల్సి ఉందని, అవి నాకు ఎందుకు అందలేదో తెలియదంటూ ట్వీట్‌ చేశారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :