బీజేపీ కూడా వ్యూహాత్మకంగా..

తెలుగు దేశం పార్టీ.. నిన్నటి వరకు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఎన్డీఏలో చేరాలని ఆసక్తి చూపింది. కానీ.. క్రమంగా పార్టీ అధినేత బాబు వ్యూహం మారింది.

బీజేపీతో పొత్తుపై ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎన్డీఏలో చేరితే తమకు సమ్మున్నత స్థానం కావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే అస్థాయి ఇచ్చేందుకు బీజేపీ ఆసక్తి లేదు. టీడీపీని బీజేపీలో కొంతమంది తక్కువగా అంచనా వేస్తుండగా, మరికొందరు ఎక్కువగా ఊహిస్తున్నారు. ఇక ఎన్డీఏలో టీడీపీ చేరినా ఎంతకాలం కొనసాగుతుందన్న సందేహాలు బీజేపీకి ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీని దూరంగా ఉంచడమే మేలన్న ఆలోచన అటు బీజేపీలో ఉంది.

జాతీయ పార్టీతో కలిసి ఉంటేనే..
అయితే చంద్రబాబు మాత్రం జాతీయ పార్టీతో కలిసి ఉంటేనే ఏపీలో రాజకీయ మనుగడ సాధ్యమన్న ఆలోచన ఉన్నారు. అది ఎన్డీఏ అయినా, ఇండియా అయినా ఏదో ఒక పార్టీ మద్దతు ఉండాలని భావిస్తున్నారు. అందుకే తాజాగా ఆయన వ్యూహం మార్చారు. మొన్నటి వరకు బీజేపీతో దోస్తీకి వెంపర్లాడిన బాబు.. ప్రస్తుతం ఎన్నికల తర్వాత ఎవరితో కలవాలని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

బీజేపీతో సున్నితంగా..
బీజేపీతో దోస్తీ లేదని ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. దీంతో బీజేపీతో సున్నితంగా వ్యవహరిస్తూనే.. పొత్తుపై క్లారిటీ ఇవ్వకుండా ఉండాలని భావిస్తున్నారు. దోస్తీకి అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో బీజేపీ గెలిచే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూడా గెలుపు అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పొత్తులు, ఎన్డీఏలో చేరిక అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడమే మంచిదని బాబు ఆలోచిస్తున్నారు.

ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. ఇండియా కూటమికి పోటీగా ఎన్డీఏ సమావేశం నిర్వహించిన బీజేపీ.. పాత దోస్తులకు కూడా ఆహ్వానం పంపింది. కానీ టీడీపీకి పిలుపు అందలేదు. అయితే టీడీపీని దూరం పెట్టినట్లు కాదని అంటున్నారు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ పార్టీతో ఏ అవసరం ఉంటుందో అన్న ఆలోచన బీజేపీలో ఉంది. దీంతో ఇప్పుడే దూరం కొట్టడం మంచిది కాదన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. దీంతో టీడీపీతో పూర్తిగా కటీఫ్‌ చేసినట్లు కాకుండా.. దోస్తీ కొనసాగిస్తున్నట్లు తెలియకుండా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

మొత్తంగా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే బీజేపీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. మరి చూడాలి పొత్తు పొడుస్తుందా లేదో..

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :