ఉల్లాసంగా…. ఉత్సాహంగా విజయసాయిరెడ్డి

ఉల్లాసంగా…. ఉత్సాహంగా విజయసాయిరెడ్డి
* కొండచిలువను మెడలో వేసుకున్న విజయసాయిరెడ్డి
శంషాబాద్ ఫాంహౌస్ లో సేదదీరిన విజయసాయి
ఫాంహౌస్ లో అనేక జీవజాతులు
వాటిని ఆసక్తిగా పరిశీలించిన విజయసాయి
ఎంతో వినోదదాయకం అంటూ ట్వీట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శంషాబాద్ లోని ఫాంహౌస్ లో ఉల్లాసంగా గడిపారు. ఈ ఫామ్ లో ఉన్న ఓ అరుదైన తెల్ల కొండచిలువను మెడలో వేసుకుని ప్రదర్శించారు. మరికొన్ని చిన్న కొండచిలువలను చేత్తో పట్టుకున్నారు. వాటిని ఆసక్తిగా పరిశీలించారు. అంతేకాదు, ఓ భారీ సాలీడును కూడా తన చేతిపైకి ఎక్కించుకున్నారు. ఈ ఫాంహౌస్ లో రంగురంగుల మకావు చిలుకలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. వివిధ జీవజాతులు వైవిధ్యభరితమైన సౌందర్యాన్ని ఆసక్తిగా గమనించడం తనకు వినోదాన్నిస్తుందని తెలిపారు

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :