ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ –

ఐఎండి సూచనల ప్రకారం
నైరుతి మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ప్రస్తుతానికి జాఫ్నా (శ్రీలంక)కి తూర్పున 600 కి.మీ.,తూర్పు ఆగ్నేయంగా కారైకాల్‌కు 630 కి.మీ., చెన్నైకి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

నెమ్మదిగా వాయుగుండంగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణకోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం

దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం

ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదు

వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

– డా.బి.ఆర్ అంబేద్కర్ , ఎండి , విపత్తుల సంస్థ

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :