మా బాధ లు ఎవరు అర్దం చేసుకుంటారు..

మా బాధ లు ఎవరు అర్దం చేసుకుంటారు..

🙏అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు🙏

⚡ నువ్వు అలిగితే.. ఆడపిల్లవా. .అని హేళన

⚡నువ్వు ఏడిస్తే..ఏడ్చేవాడిని
నమ్మొద్దని హేళన..

⚡సరదాగా బయటతిరిగితే.. తిరుగుబోతు అని బిరుదు

⚡బాధ మరిచిపోవడానికి తాగితే… తాగుబోతు అని బిరుదు

⚡అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అని

⚡భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడని

⚡చెల్లె, అక్క,బావ ,బాబాయ్, మాట వింటే చేతకాని చవట అని

⚡దోస్తులతో బయట తిరిగితే
జులాయి అని

⚡ఎక్కువ మాట్లాడితే పోకిరి అని

⚡తక్కువ మాట్లాడితే నల్లికుట్లోడు అని

…నీవు ఏమి చేసినా, ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో.
ఇంటా-బయట అన్ని రకాల
బాధలు భరిస్తూనే,అవమానాలు సహిస్తూనే..బాధ్యతలు మోస్తూనే.. కొడుకు గా,తండ్రిగా,భర్తగా,సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమ ను పంచుతూ..అనునిత్యం త్యాగాలు చేస్తూ… నే ఉన్న.. ఓ..”మగ”ధీరుల్లారా..

⚡విధి వంచిత,ప్రియురాలు-భార్యాభాధిత, జనబాధిత,అప్పుబాధిత…మొ’
..
శోకా..తప్త హృదయుల్లారా
బాధా సర్పదష్టుల్లారా..

⚡ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా.. (కొందరు)

⚡బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని నిస్సహాయ పురుషుల్లారా…

⚡బ్రతుకు సమరం లో చితికిపోయిన అభినవ గరళకంఠుల్లారా..

⚡జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా..

⚡కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా ఇంటి సైనికుల్లారా..

⚡కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న జీతంలేని నిరంతర శ్రామికుల్లారా..

⚡ వచ్చింది.. నీ కోసం ఓ రోజు
నీకూ. కేటాయించారు..ఓ రోజు

ఈ రోజైనా.. ..అన్నీ.. మరిచి…
నీ కోసం.. నీవు కాసేపైనా.. సమయాన్ని కేటాయించుకొని
సంతోషంగా గడుపుతావని.. ఆశిస్తూ… మగ మహారాజులు అందరికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు… Ji

 

HAPPY MEN’S DAY-2022
సర్వే (పురుష) జన సుఖినోభవంతు🙏.. 😁😁😁మీ స్నహితుడు ,, పవన్ గౌడ్

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :