కర్నటకలో ‘గృహ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య

: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రారంభించారు.

ఈ పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతీ నెల ప్రభుత్వం రూ. 2 వేలు అందిస్తుంది.

ప్రతీ మహిళకు రూ. 2 వేలు

ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు ప్రధాన హామీలను ఇచ్చింది. అందులో ఒకటి గృహలక్ష్మి పథకం. ఈ పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతీ నెల ప్రభుత్వం రూ. 2 వేలు అందిస్తుంది. అంటే, సంవత్సరానికి ఆ మహిళకు రూ. 24 వేలు అందుతాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధ రామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం, ఆయన ఎన్నికల హామీలను ఒకటొకటిగా అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.28 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం సిద్ధ రామయ్య ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 24,166 కోట్లను కేటాయించింది.

ఆగస్ట్ 16 నుంచి..

గృహలక్ష్మి పథకం ఈ సంవత్సరం ఆగస్ట్ 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీఎం సిద్ధ రామయ్య వెల్లడించారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 30 వేల కోట్ల భారం పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంక్షేమ పథకం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబానికి పెద్దగా ఉన్న మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన (APL) ఉన్న కుటుంబానికి పెద్దగా ఉన్న మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. అయితే, వారు కానీ, వారి భర్త కానీ ఆదాయ పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు.

ఎస్ఎంఎస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన మహిళలు ఈ స్కీమ్ లో లబ్ధిదారులుగా చేరడానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న మహిళలు ముందుగా తమ మొబైల్ ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ చేయాలి. ఆ తరువాత, ఎక్కడికి, ఎప్పుడు రావాలో, ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలో తెలుపుతూ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ సమయంలో, అక్కడికి, అవసరమైన డాక్యుమెంట్లతో వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా, తమ ప్రాంతంలోని బెంగళూరు వన్ సెంటర్, కర్నాటక వన్ సెంటర్, లేదా గ్రామ వన్ లేదా బాపూజీ సేవా కేంద్ర.. తదితర సెంటర్లలోకి నేరుగా వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :