రైతుల కోసం ‘మోడీ’ మరో వరం

ప్రధాని మోడీ రైతుల కోసం మరో వరం ఇచ్చారు. దేశంలో రైతులకు కావాల్సిన ప్రధాన ముడి సరుకు ఎరువు. ఇప్పుడు వర్షకాలం కావడంతో ఎరువులకు చాలా డిమాండ్.

ఒకప్పుడు ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోయిన రైతులు కోకొల్లలు. కానీ మోడీ వచ్చాక ప్లానింగ్ మారింది. మార్కెట్లో ఎరువుల లభ్యత పెరిగింది. పరిశ్రమల నుంచి ఉత్పత్తి పెరిగింది. అందుకే రైతులకు కాన కష్టం ఎరువుల విషయంలో ఏర్పడడం లేదు.తాజాగా రైతులకు మరింతగా సేవ చేసేందుకు మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రేపటి నుంచి ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. తొలిదశలో 1.25 లక్షల షాప్ లని ప్రధాని రేపు ప్రారంభిస్తారని ఈ షాప్ ల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు

2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి. ప్రధానమంత్రి మోడీ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్​ సమ్మాన్​ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్​ షాపులను ప్రధానమంత్రి కిసాన్​ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నది. ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్​ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్​ టెస్టింగ్​ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్​ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :