దేశమంతటా ఏఐ ఉండాలి.. బిల్ గేట్స్‌తో కలిసి టీ తాగుతూ ప్రధాని మోడీ కబుర్లు..

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. వీరిద్దరు కలిసి టీ తాగుతూ ప్రపంచానికి సంబంధించిన కబుర్లు చెప్పుకున్నారు. భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు ఆయన కలిసి చాలా విషయాలను చర్చించారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన సంభాషణ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు గంటల ప్రధాని, బిల్ గేట్స్ ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుందాం.

 

ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏఐ టెక్సాలజీపై ప్రధాని మోడీ, బిల్ గేట్స్ చర్చించుకున్నారు. నమో యాప్ లో ఏఐ వాడకం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. డిజిటలైజేషన్ తో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరోవైపు 2023లో భారత్ లో జరిగిన జీ20 సదస్సుపై కూడా మోడీ ప్రస్తావించారు.

 

జీ20 సమావేశంలో ఏఐ టెక్నాలజీ గురించి వివరించినట్లు తెలిపారు. మరోవైపు ఏఐతో మోడీపై డీప్ ఫేక్ వీడియోలు కూడా చేసినట్లు ఆయన బిల్ గేట్స్‌తో జరిగిన సంభాషణలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ.. ‘నేను కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతాను. అదేవిధంగా టెక్నాలజీని వాడడంలోను ముందుంటాను. అయితే ఇదే సమయంలో జీ20 సమావేశంలో ఏఐ టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్నాం. ఏఐతో హిందీలో నేను చేసిన ప్రసంగాన్ని తమిళంలోకి ట్రాన్స్ లేట్ చేయించాం. అయితే ఇలా చేయడం బాగానే ఉంది. ఏఐ భారత దేశమంతటా ఉండాలి. ఏఐ చాలా శక్తివంతమైంది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. దీనిని ఒక మ్యాజిక్ టైల్ లాగా ఉపయోగిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇది కనుక తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే డీప్ ఫేర్ తో నా గొంతును కూడా మార్చారు’ అని తెలిపారు.

 

మోడీ వ్యాఖ్యలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. మనం ప్రస్తుతం ఏఐ వినియోగంలో ఫస్ట్ స్టెప్ లో మాత్రమే ఉన్నాం అన్నారు. టెక్నాలజీ అనేది చాలా పెద్దది. దాంతో ఎన్నో సమస్యలు, సొల్యూషన్స్ రెండు ఉంటాయి అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :