భారీగా నోట్ల కట్టలు, వాళ్లు బీజేపీ కార్యకర్తలా..? నాలుగు కోట్లు సీజ్..

సార్వత్రిక ఎన్నికల వేళ ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం భారీ ఎత్తున పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను మొహరించినా డబ్బు పట్టుబడుతోంది. తాజాగా తమిళనాడులో ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.

 

ఎన్నికల వేళ అన్నిఏరియాల్లో భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం ఆపేందుకు భారీ ఎత్తున యంత్రంగాన్ని మొహరించింది ఎన్నికల సంఘం. అయినా నగదు, నగలు పట్టుబడుతోంది. తాజాగా తమిళనాడులోని తాంబరం రైల్వేస్టేషన్‌లో అధికారులు భారీ ఎత్తున నగదు సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు బీజేపీ కార్యకర్తలను తేలింది. వారి నుంచి నాలుగు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

 

మొత్తం ఆరు బ్యాగుల్లో డబ్బును తీసుకెళ్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అందులో ఒకరు హోటల్ మేనేజర్ కాగా, మరో ఇద్దరు బీజేపీ సభ్యులుగా పోలీసులు తెలిపారు. ఈ సొమ్మును లెక్కించేందు కు పోలీసులు కౌంటింగ్ మిషన్లను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎట్టకేలకు లెక్కింపు పూర్తి అయ్యింది. నాలుగు కోట్లు రూపాయలుగా తేల్చారు పోలీసులు.

 

వీరిని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరునెల్వేలి బీజేపీ అభ్యర్థి టీమ్ సూచనల మేరకు పని చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. తమిళనాడులో తొలిదశ పోలింగ్ ఈనెల 19న ఒకే విడతగా 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే సరైన సమయమని భావించిన బీజేపీ కార్యకర్తలు.. డబ్బు తీసుకెళ్తూ అడ్డంగా బుక్కయ్యారు.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :