హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ.. నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేర్చడంలో హైదరాబాద్ మెట్రో సక్సెస్ అయింది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ వరకూ, నాగోల్ నుంచి రాయ్ దుర్గ్ వరకూ తిరుగుతున్న మెట్రో రైళ్లలో.. ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లేవారికి మెట్రో వల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే కష్టాల నుంచి మెట్రో ఉపశమనాన్ని ఇచ్చింది. నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను మెట్రో గమ్యస్థానాలకు చేరుస్తోంది.

 

అలాంటి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో కార్డుపై ఇచ్చిన 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రోల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మెట్రో కార్డుపై రాయితీని రద్దు చేయడమే కాకుండా రూ.59కే అందిస్తున్న హాలిడే కార్డును కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ లోనూ మెట్రో యాజమాన్యం రాయితీని రద్దు చేసింది. మెట్రోల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో 10 శాతం డిస్కౌంట్ ఎత్తివేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8-11 వరకూ ఇచ్చే 10 శాతం రాయితీని తొలగించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో మెట్రోకు ఏర్పడిన డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో యాజమాన్యం వెల్లడించింది. మండుటెండలో బస్సుల్లో, టూవీలర్లపై జర్నీలు చేయలేక.. కూల్ గా మెట్రోలో వెళ్లే ప్రయాణికులకు ఇది ఊహించని షాకే. రాయితీని రద్దు చేయడంతో ఆగ్రహిస్తున్న ప్రయాణికులు.. రద్దీ దృష్ట్యా మెట్రో రైల్ కోచ్ లను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :